ధరలు పెంచితే ఏడేళ్ల జైలు శిక్ష

8 Apr, 2020 12:53 IST|Sakshi

న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్‌, ధరలు పెంచే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. నిత్యావసరాల కొరత, ధరల పెరుగుదల లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. బ్లాక్‌ మార్కెటింగ్, ధరలు పెంచితే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని పేర్కొంది.

మరిన్ని వార్తలు