జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్!

25 Nov, 2014 17:42 IST|Sakshi
జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్!

ఉత్తర కాశ్మీర్లో రెండుచోట్ల బాంబులు పేలాయి. అయినా, తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ దాటింది. తొలి విడతలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఈ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 70% పోలింగ్ రికార్డయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో అయితే కనిష్ఠంగా కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ స్థితి నుంచి క్రమంగా బయటపడి.. ఇప్పుడు 70% పోలింగ్ నమోదుచేసే స్థితికి జమ్ము కాశ్మీర్ చేరుకుంది.

ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు సహా మొత్తం 132 మంది అభ్యర్థులు తొలిదశలో పోటీపడ్డారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం చలి కారణంగా పోలింగ్ కొంత మందగించినా, మధ్యాహ్నానికి బాగా పుంజుకుంది. బండిపురా ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రం బయట బాంబు పేలింది. అలాగే ఇదే ప్రాంతంలో మరోచోట కూడా మధ్యాహ్నం ఇంకో బాంబు పేలింది. అయినా.. ఓటర్లు మాత్రం చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఓట్లు వేసేందుకు ముందుకొచ్చారు.

మరిన్ని వార్తలు