జమ్ముకాశ్మీర్లో 71% ఓటింగ్ నమోదు

2 Dec, 2014 19:06 IST|Sakshi
జమ్ముకాశ్మీర్లో 71% ఓటింగ్ నమోదు

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. తొలిదశలో లాగే, ఉగ్రవాదుల హెచ్చరికలను పూర్తిగా పక్కన పెట్టి.. రెండో దశలో కూడా 71 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండోదశ పోలింగ్ మంగళవారం ప్రారంభం అయినప్పుడు మొదట్లో కాస్త పల్చగా ఉంది. కానీ, కాస్త ఎండ ముదిరేకొద్దీ ఓటర్లు బారులు తీరారు. దక్షిణ కాశ్మీర్లోని దేవ్సర్, హొమేషలీబగ్, నూరాబాద్, కుల్గం నియోజకవర్గాల్లో మొదట్లో ఓటింగ్ కాస్త పల్చగానే ఉంది.

హంద్వారా పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పురుషులు, మహిళలు బారులు తీరారు. మార్పు కోసమే తాము ఓట్లు వేసినట్లు చాలామంది ఓటర్లు తెలిపారు. సైనికులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రత కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ 80 శాతం వరకు కూడా నమోదైనట్లు ఈసీ వర్గాలు చెప్పాయి. పూంఛ్, కుప్వారా లాంటి సరిహద్దు ప్రాంతాల్లో 78, 68 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి.

మరిన్ని వార్తలు