ఉంపన్‌ విధ్వంసం : 72 మంది మృతి

21 May, 2020 16:52 IST|Sakshi

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లో ఉంపన్‌ తుపాను పెను వినాశనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన బెంగాల్‌లో ఉంపన్‌ వల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. వేలమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఇలాంటి విధ్వంసం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బెంగాల్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడాలని మమత కోరారు. మరోవైపు ఉంపన్‌ తీవ్ర రూపం దాల్చడంతో బెంగాల్‌ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. రాజధాని కోల్‌కత్తా ప్రాంతంలో రవాణా వ్యవస్థ, విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా నీట మునిగింది.  (నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు)


 

మరిన్ని వార్తలు