'ఎబోలా’ భయంతో భారత్కు పయనం

26 Aug, 2014 20:22 IST|Sakshi
న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎబోలా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళుతున్న ఓ ప్రయాణికుడు

 న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ విజంభిస్తుండటంతో అక్కడకు వలస వెళ్లిన భారతీయులు క్రమంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. లైబీరియా, నైజీరియాల నుంచి మంగళవారం ఉదయం మొత్తం 91 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. లైబీరియా నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆరుగురు ప్రయాణికుల్లో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వారిని అధికారులు పరీక్షల నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు విడతలుగా చేరుకున్న 85 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్ ఆరోగ్య సంస్థ పరీక్షించి వారిలో వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించింది.

కాగా, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాల వల్ల తలెత్తిన దుర్భర పరిస్థితులు ఈ వైరస్ విస్తరించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాయని బెల్జియం శాస్త్రవేత్త పీటర్ పయట్ అభిప్రాయపడ్డారు.  ఎబోలా వైరస్‌ను 1976లో  పీటర్ పయట్ గుర్తించారు.

మరిన్ని వార్తలు