వడోదరలోని గ్యాస్‌ కర్మాగారంలో పేలుడు

12 Jan, 2020 05:19 IST|Sakshi

ఎనిమిది మంది దుర్మరణం

వడోదర: గుజరాత్‌ వడోదర జిల్లాలోని ఓ మెడికల్‌ గ్యాస్‌ తయారీ కర్మాగారంలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో పద్రా తహసీల్‌ గవాసద్‌ గ్రామంలోని ఎయిమ్స్‌ ఇండస్ట్రీస్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. సిలిండర్లలో గ్యాస్‌ నింపే సమయంలో ఈ పేలుడు సంభవించిందని వడోదర రూరల్‌ ఎస్పీ సుధీర్‌ చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు