ఆ 8 ప్రాంతాలు మండిపోతున్నాయి...

3 Jun, 2019 13:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భూగోళం అగ్నిగోళంగా మారుతోంది. ప్రపంచంలోనే అట్టుడుకిపోతోన్న 15 ప్రాంతాల్లో ఉత్తర, కేంద్ర భారత్‌లోని ఎనిమిది ప్రాంతాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో రాజస్తాన్‌లోని చురు, గంగానగర్‌ ప్రాంతాలున్నాయని ‘ఎల్‌ డొరాడో’ అనే వాతావరణ సంస్థ  వెబ్‌సైట్‌ సోమవారం వెల్లడించింది. ఆదివారం నాడు చురులో 48.9, గంగానగర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. వాటితోపాటు రాజస్తాన్‌లోని ఫలోడి, బికనర్, జైసాల్మర్, మధ్యప్రదేశ్‌లోని నౌగాంగ్, కజూరహో, హర్యానాలోని నార్నౌల్‌ ప్రాంతాలు మండిపోతున్నాయి. నైరుతి, కేంద్ర భారత్‌ ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులపాటు కొనసాగి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 

పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, తూర్పు రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో మోస్తారు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పాకిస్థాన్, రాజస్తాన్‌ ఎడారుల్లో ఉత్పన్నమైన వేడి కారణంగా ఈ వడగాలులు వీస్తున్నాయని, రాళ్లవాన, ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల మరో రెండు రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ఓ రైతు సహా ముగ్గురు మరణించారు. తూర్పు, ఉత్తర భారత్‌ ప్రాంతాల్లో జూన్‌ 7 నుంచి 9 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ మారుమూల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

అరగంట టైం వేస్ట్‌ అవుతోంది.. చెట్లు నరికేయండి

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’

కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి

సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి

ఈనాటి ముఖ్యాంశాలు

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్‌?

రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

‘బెస్ట్‌’  బస్సు నడపనున్న ప్రతీక్ష

భార్య పోలీస్‌ డ్రెస్‌ ప్రియురాలికిచ్చి..

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

వదలని వాన.. 43 మంది మృతి..!

ఆధార్‌ నెంబర్‌ తప్పుగా సమర్పిస్తే భారీ ఫైన్‌!

దారుణం: భార్యాభర్తల గొడవలో తలదూర్చినందుకు..

కర్ణాటక సంక్షోభం.. ఎమ్మెల్యేలకు రాజభోగాలు..

తమిళ హిజ్రాకు కీలక పదవి

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మూకదాడి..!

అతడి దశ మార్చిన కాకి

ఖాళీగా లేను వచ్చేవారం రా! 

ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది