'ఆమె'కు అక్కడా అసమానతే..!

15 Dec, 2015 18:59 IST|Sakshi
'ఆమె'కు అక్కడా అసమానతే..!

ఆకాశంలో సగం అంటున్న ఆధునిక సమాజంలోనూ.. మహిళలు అన్నింటా వెనుకబడే ఉంటున్నారంటున్నాయి తాజా నివేదికలు. ముఖ్యంగా భారతదేశంలో పనిలో, ఇతర చెల్లింపుల విషయంలోనే కాక... కనీస అవసరాలుగా మారిపోయిన బ్యాంకు ఖాతా, ఇటర్నెట్ వాడకం విషయంలోనూ మహిళలపై  తీవ్ర అసమానతలు  పెరిగిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 2015 యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం (UNDP) మానవాభివృద్ధి నివేదిక ప్రకారం లింగ అసమానతలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కలతచెందే విధంగా ఉండటం శోనీయమని, ముఖ్యంగా ఇండియాలో ఈ శాతం మరీ ఎక్కువగా ఉందని చెప్తున్నాయి.

భారతదేశంలో ఎనభై శాతం మంది మహిళలకు కనీసం బ్యాంకు ఖాతాలు లేకపోవడం అసమానతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం ప్రపంచంలో 42 శాతం వరకూ మహిళలకు బ్యాంకు ఖాతాలు లేకపోగా.. అది భారత్ లో మరీ ఎక్కువ ఉన్నట్లుగా తాజా లెక్కలు చెప్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఇండియా, మెక్సికో, పాకిస్థాన్, యుగాండా సహా మొత్తం 38 దేశాల్లో ఎనభైశాతం కన్నా ఎక్కువ మంది మహిళలకు బ్యాంకు ఖాతాలు లేకపోగా... దీనికి భిన్నంగా జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాల్లో 90 శాతం కన్నా ఎక్కువ మందికి ఖాతాలు కలిగి ఉండటం తీవ్ర వ్యత్యాసాన్ని తెలుపుతోంది.

నిజానికి ఈ అసమానతలు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే కాక, ఇంటర్నెట్ ఉపయోగించడంలోనూ కనిపిస్తున్నాయి. భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల్లో పురుషుల శాతంతో పోలిస్తే మహిళల శాతం తీవ్ర నిరాశాజనకంగానే ఉన్నట్లు తెలుస్తోంది.  2013 లెక్కల ప్రకారం పురుషులు 61శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుంటే, స్త్రీలు 39 శాతం మాత్రమే ఉన్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఇతర దేశాల్లోని నివేదికలతో సరిపోల్చి చూసినప్పుడు చైనాలో మహిళలు 44శాతం, పురుషులు 56శాతం... టర్కీలో మహిళలు 44శాతం, పురుషులు 64శాతం వంటి కొద్ది మాత్రపు తేడాతోనే ఉండగా... భారతదేశం మాత్రం ఈ విషయంలో అత్యంత అధికస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.   

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే భారత్, చైనాల మూలాలు క్షీణిస్తున్నట్లుగా 2014 నివేదికలు చెప్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే పురుషులకన్నా..ప్రపంచ వ్యాప్తంగా  మహిళా భాగస్వామ్యం తీవ్రంగా పడిపోయినట్లు నివేదికలు నిరూపిస్తున్నాయి. 1990 లో 35 శాతం ఉన్నమహిళా భాగస్వామ్యం... 2013 నాటికి 27కు తగ్గిపోయింది. అదే చైనాలో 1990లో  73 శాతం ఉండగా... 2013 నాటికి 64 కు పడిపోయింది. ఇప్పటికైనా భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు