కేరళ : దక్షిణాది తారల భారీ విరాళం

1 Sep, 2018 11:11 IST|Sakshi

కేరళ వరద బాధితులకు  ప్రపంచ నలుమూలలనుంచీ భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. దేశీయంగా రాజకీయ, సినీ, క్రీడారంగ,ఇతర  ప్రముఖుల కూడా స్పందన కూడా విరివిగానే లభిస్తోంది. తాజాగా దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా స్పందించారు. ‘80's సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌'   పేరుతో కేరళ వరద బాధితుల సహాయార్ధం భారీ విరాళాన్నిచ్చింది.
 
కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ‘80's సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌' పేరుతో వసూలు చేసిన 40 లక్షల రూపాయల విరాళం అందజేశామని సీనియర్‌ హీరోయిన్‌ సుహాసిని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. శుక్రవారం కేర‌ళ సీఎంను కలిసి ఈ నగదును అందజేసామంటూ, ఆమె ఒక ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఈ కార్యక్రమంలో  అలనాటి హీరోయిన్లు కుష్బు , లిజీ కూడా పాల్గొన్నారు. 80's సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌'  ఆధ్వర్యంలో స్నేహితులు, బంధువుల నుంచి కూడా విరాళాలు సేకరించామని నటి లిజి మీడియాకు తెలిపారు.  గాడ్స్‌ ఓన్‌ కంట్రీ  వాసులు  పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.ఈ ఆపద సమయంలో   తామంతా వారికి  అండగా ఉన్నామనే భరోసా కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నామన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు