కరోనా : పెరుగుతున్న అనుమానితుల సంఖ్య

29 Jan, 2020 19:54 IST|Sakshi

తిరువనంతపురం : ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. అటు భారతదేశంలో కూడా కరోనా  వైరస్‌ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా  కేరళలో 806 మందిని  కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో పరిశీలనలో ఉంచారు.  వీరిలో పది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ బుధవారం ఈ సమాచారాన్ని అందించారు. 

19మందిని వివిధ ఆసుపత్రులలో చేర్పించగా, వారిలో తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్యమంత్రి వెల్లడించారు. పదహారు నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా  పది కేసుల్లో ఫలితం ప్రతికూలంగా (నెగిటివ్‌) వచ్చినట్టు తెలిపారు. మిగిలిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. చైనానుంచి తిరిగి వచ్చినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య అధికారులతో సంప్రదించాలని ఆమె సూచించారు. మరోవైపు కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోవటానికి కేరళలో ఏర్పాట్లను పరిశీలించడానికుద్దేశించిన కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన షౌకత్ అలీ మంగళవారం 436 మంది పరిశీలనలో ఉన్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు