ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్‌

31 May, 2020 04:57 IST|Sakshi

సాక్షి ముంబై/షిర్డీ: మహారాష్ట్రలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు 62,228 మంది కరోనా బారిన పడగా 26,997 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజులోనే 8,381 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరిలో ముంబై నుంచే 7,358 మంది ఉన్నారు. ముంబైలో ఇప్పటి వరకు 16,008 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,133 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. అదేవిధంగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,325కు చేరగా ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు.

షిర్డీలో తొలి కరోనా కేసు
షిర్డీకి చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో పట్టణాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. వచ్చే 14 రోజులపాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు