భారత్‌లో కొత్తగా 8,392 కరోనా కేసులు

1 Jun, 2020 10:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. నిన్న 8,380 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిన్నటి కంటే ఎక్కువగా 8,392 కొత్త కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 230 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కు చేరింది. ఈ మేరకు సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 91,819మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జవ్వగా.. దాదాపు 93వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,394గా ఉంది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ ఉన్నాయి. కాగా, 1లక్ష 90వేల కరోనా కేసులతో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ఏడో స్థానంలో ఉంది.

చదవండి : కరోనా: రికార్డు స్థాయిలో కేసులు

>
మరిన్ని వార్తలు