కరోనా : 84శాతం మంది ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారు

9 Apr, 2020 22:10 IST|Sakshi

భారతదేశంలో 84 శాతం మంది కరోనా మహమ్మారిని నివారించడానికి ఇళ్లకే పరిమితమాయ్యరని ఇప్సోస్ పోల్ తన సర్వేలో స్పష్టం చేసింది. మొత్తం భారత్‌తో సహా 14 దేశాల్లో ప్రతీ 5 మందిలో నలుగురు ఇంట్లో ఉండడానికే ఇష్ట పడుతున్నారని ఇప్సోస్ ఇండియా పేర్కొంది. అయితే ప్రపంచంలో అధిక భాగంలో దేశాలు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయని తెలిపింది. కాగా రష్యా, వియత్నాం, ఆస్ట్రేలియా ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారని సర్వేలో వెల్లడించింది. ఇక దేశాల వారిగా చూస్తే స్పెయిన్‌ 95 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో వియత్నాం(94శాతం), ఫ్రాన్స్‌(90 శాతం), బ్రెజిల్‌(89 శాతం), మెక్సికో( 88 శాతం), రష్యా(85 శాతం)లు ఉన్నాయి. కాగా భారత్‌ ఈ జాబితాలో అమెరికాతో సంయుక్తంగా 84 శాతంతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది.

అంతేగాక 15 దేశాల్లో దాదాపు 14 దేశాల ప్రజలు హోమ్‌ క్వారంటైన్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని , ఇంట్లో ఉంటేనే కరోనా బారీ నుంచి రక్షించుకోగలమని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా ఏప్రిల్‌ 2 నుంచి 4 వరకు 28వేల మంది సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు ప్రాధాన్యమిచ్చారని, ఇందులో జపాన్‌ నుంచి తక్కువ సంఖ్యలో ఉన్నారని తేలింది. 'ఇది చాలా అపూర్వమైన కాలం. చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచంలోని మిగతా దేశాలకు వేగంగా విస్తరిస్తూ మహమ్మారిగా మారింది. కరోనా దూకుడును అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్ని  లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. మెజారిటీ భారతీయులు ఇంట్లో ఉండడం ద్వారా లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా పాటిస్తున్నారంటూ' ఇప్సోస్ ఇండియా సీఈవో అమిత్ అదార్కర్ తెలిపారు.
(ఏపీలో 363కు కరోనా పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు