2.07 లక్షలకు పెరిగిన కోవిడ్‌-19 కేసులు

3 Jun, 2020 10:08 IST|Sakshi

మహమ్మారి విజృంభణ

సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,07,615కు ఎగబాకింది. మహమ్మారి బారి నుంచి 1,00,303 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు దాదాపు 50 శాతానికి చేరడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇక 1,01,487 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5815కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు భారత్‌లో కోవిడ్‌-19 మరణాలను తక్కువగా చూపుతున్నారనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కోవిడ్-19తో పాటు ఇతర వ్యాధులతో మరణించిన వారి గణాంకాలను విశ్లేషించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని, మృతుల సంఖ్యను తక్కువ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.

చదవండి : 4 నెలలుగా కరోనాతో పోరాటం.. వైద్యుడి మృతి

మరిన్ని వార్తలు