96 ఏళ్ల వయసులో ‘లిటరసీ’ పరీక్షకు..

6 Aug, 2018 06:14 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్‌ నిర్వహించిన పరీక్షకు హాజరైన 96 ఏళ్ల కార్తియాని అమ్మ..చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించింది. చదవడం, రాయడం నేర్చుకోవాలనే బలమైన కోరికతో కార్తియాని ఆరు నెలల క్రితం అక్షరాస్యత కార్యక్రమం ‘అక్షరలక్షం’లో పేరు నమోదు చేయించుకుంది. శిక్షణా కాలంలో గణితం, చదవడం, రాయడంపై పట్టు సాధించిన ఆమె..ఆదివారం తిరువనంతపురంలో పరీక్ష రాసి కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసింది.  

మరిన్ని వార్తలు