ముంచెత్తుతున్న వరదలు.. 99 గ్రామాలు జలమయం

24 Jun, 2020 09:00 IST|Sakshi

అసోం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఈశాన్య రాష్ట్రం అసోంను ముంచెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా అసోంలోని 4 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 99 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ మేరకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మంగళవారం పేర్కొంది.  దీహాజీ, జోర్హాట్‌, శివసాగర్‌, దిబ్రూఘడ్‌ జిల్లాల్లో 4,329 హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు నివేదకలు వెల్లడిస్తున్నాయి. ఈ జిల్లాల్లో 30 సహాయక శిబిరాలను శిబిరాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు.

ముంపుకు గురైన  ప్రాంతాల నుంచి దాదాపు 37 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా నీమాటిఘాట్‌ (జోర్హాట్‌) వద్ద బ్రహ్మపుత్ర, ధుబ్రీ.. శివసాగర్‌ వద్ద డిఖో.. నంగ్లమురాఘాట్‌ వద్ద డిసాంగ్‌.. నుమాలిగ వద్ద ధన్సిరి.. ఎన్టీరోడ్‌ క్రాసింగ్‌ వద్ద జియా భరాలీ నదులు పొంగిపొర్లుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. చదవండి: చెరువులో పడి ఐదుగురు బాలికలు మృతి 

మరిన్ని వార్తలు