'అమానవీయంగా ప్రవర్తించారు'

16 May, 2016 15:21 IST|Sakshi
'అమానవీయంగా ప్రవర్తించారు'

న్యూఢిల్లీ: నడవలేని స్థితిలో ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలి పట్ల ఎయిర్ ఇండియా సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. వీల్ చైర్ లో వచ్చిన ఆమెను విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీ మీదుగా న్యూయార్క్ వెళ్లే విమానం ఎక్కేందుకు వచ్చిన వృద్ధురాలిని 'ఓవర్ బుకింగ్' కారణంగా ఎయిర్ ఇండియా సిబ్బంది అడ్డుకున్నారు.

ఆమె కుమార్తె ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తన తల్లికి సాయం చేయాలని ఎయిర్ ఇండియాకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన అధికారులు వృద్ధురాలిని ఢిల్లీ-లండన్ విమానంలో పంపించారు. అక్కడి నుంచి కనెక్టింగ్ విమానం ద్వారా శనివారం న్యూయార్క్ కు చేర్చారు.

ముందు రోజు విమానం రద్దు కావడంతో తన తల్లికి ముంబై-న్యూయార్క్ విమానంలో ప్రవేశం నిరాకరించారని వృద్ధురాలి కుమార్తె తెలిపారు. తన తల్లి పట్ల అమానవీయంగా వ్యవహరించారని, వీల్ చైర్ కూడా ఎప్పటికో ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాతే ఎయిర్ ఇండియా సిబ్బంది స్పందించారని చెప్పారు.

మరిన్ని వార్తలు