ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు

7 Nov, 2015 03:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అవిభక్త కవలలు వీణావాణిలకు వైద్య చికిత్సల పేరుతో సేకరించిన విరాళాలను బాధితులకు ఇవ్వని ఆంధ్రజ్యోతి, ఏబీన్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తెలిపింది. జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్, సీహెచ్ ఉపేంద్ర శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.  ఆ విరాళాల లెక్కలను చానల్ యాజమాన్యం చూ పించడం లేదని, విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరామని తెలిపారు.

మరిన్ని వార్తలు