ముద్దు తెచ్చిన ముప్పు.. 10 మంది సస్పెన్షన్

8 Nov, 2014 14:47 IST|Sakshi
ముద్దు తెచ్చిన ముప్పు.. 10 మంది సస్పెన్షన్

ఒక్క ముద్దు, మరొక్క కౌగిలింత.. చివరకు సస్పెన్షన్కు దారితీశాయి. ఏబీవీపీకి చెందినవాళ్లు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారంటూ.. దానికి వ్యతిరేకంగా కేరళలోని కొచ్చిలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సంఘీభావంగా 'హగ్ ఆఫ్ లవ్' అనే కార్యక్రమాన్ని కూడా కొంతమంది విద్యార్థినీ విద్యార్థినులు నిర్వహించారు.

అయితే.. ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పదిమంది విద్యార్థులను అక్కడి కాలేజి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం విషయంలో పోలీసులు సైతం వంద వరకు కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా కాలేజి నుంచి సస్పెన్షన్ వరకు దారితీసింది. ఈ ముద్దుల వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు