-

‘పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురండి’

20 May, 2015 01:43 IST|Sakshi

న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వచ్చేలా అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను ప్రజా సంస్థలుగా(పబ్లిక్ అథారిటీస్) ప్రకటించాలని కోరుతూ ప్రజాస్వామ్య సంస్కరణలు, సమాచార హక్కు కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే, అన్ని పార్టీలు తమ ఆదాయ, వ్యయ వివరాలను కచ్చితంగా వెల్లడించాలని కూడా ఆదేశించాలని కోరారు.

రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేందుకు పై మార్పులు అవసరమని పేర్కొంటూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వ్యవస్థాపక సభ్యుడు జగ్దీప్ ఛోకర్, సమాచార హక్కు కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్‌ల తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ పిల్‌ను దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు