తనిఖీలకు వెళ్లిన కుక్కను పాము కరిచింది

15 Apr, 2017 10:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజాపూర్‌: చత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్‌ సిబ్బందితో పాటు తనిఖీలకు వెళ్లిన స్నిఫర్‌ డాగ్‌ను పాము కరిచింది. దీంతో దానిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

శనివారం సుక్మా జిల్లాలో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు 2 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్‌ కోసం సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు వెళ్లిన స్నిఫర్‌ డాగ్‌ పాముకాటుకు గురైందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు