'ఆమె నాభార్య.. కాదు నాభార్య..'

14 Sep, 2017 14:33 IST|Sakshi
'ఆమె నాభార్య.. కాదు నాభార్య..'

పాట్నా: అక్బర్‌-బీర్బల్‌ కథలో ఒక ఆవుకోసం ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగే కథ తెలుసు కదా. ఆవు నాదంటే కాదు నాదే అంటూ న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్తారు. అలాంటి సన్నివేశమే బిహార్‌ రాజధాని పాట్నాలో జరిగింది. కాకపోతే అప్పడు ఆవు గురించి ఇప్పుడు భార్య గురించి.  ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఒక మహిళను.. ఇద్దరు వ్యక్తులు నా భార్య అంటే కాదు నా భార్య అంటూ గొడవకు దిగారు. ఆ ఇద్దరి మధ్య ఆ మహిళ పరిస్థితి దయనీయంగా మారింది. ఆమె ఒకరితో వెళదామనుకుంటే ఇంకొకరు గొడవకు దిగుతున్నారు.

దీంతో విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారించిన పోలీసులకు మరో చిక్కుప్రశ్న ఎదురైంది. ఆ మహిళ ఇద్దరికీ భార్యనే. బీహార్‌, గొరౌలీ నివాసి ప్రసాద్‌రామ్ కుమార్తె కంచన్ కుమారి. ఆమెకు గతంలో ప్రియుడు ఉండేవాడు. ఆ విషయం తెలుసుకోకుండా 2013లో తండ్రి ప్రసాద్‌రామ్‌ కుమార్తెను ధర్మేంద్ర దాస్‌కి ఇచ్చి పెళ్లిచేశాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

అయితే కొంత కాలం తర్వాత కంచన్ కుమారి ఇం‍ట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడు అనిల్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి మొదటి భర్తకు దూరంగా ఉంది. అనుకోని పరిస్థితుల వల్ల ఇటీవలే మొదటి భర్త ధర్మేంద్రకు కంచన్ ఎదురుపడింది. దీంతో ఆమె ప్రేమ కథ కూడా అతనికి తెలిసింది. దీంత ఇద్దరు భర్తలు గొడవకు దిగారు. కాగా ఇద్దరు భర్తల వాదనను విన్న పోలీసులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా