విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్‌

3 Mar, 2017 01:56 IST|Sakshi
విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్‌

న్యూఢిల్లీ: సముద్ర ఉపరితల లక్ష్యాలను ఛేదించడంలో భారత్‌ మరో ముందడుగు వేసింది. ప్రాజెక్టు 75 ద్వారా నిర్మించిన స్కార్పియో తరగతి కల్వరి జలాంతర్గామి నుంచి తొలిసారి నావికా దళం ప్రయోగించిన నౌక విధ్వంసక క్షిపణి.. ఉపరితలంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిం చింది. ఈ మేరకు రక్షణ శాఖ గురువారం ప్రయోగం వివరాలు వెల్లడించింది. ‘ ఈ క్షిపణి ఆవిష్కరణతో మరో మైలురాయిని అధిగమించాం.

తాజా ప్రయోగంతో నావికాదళం ఉపరితల రక్షణ సామర్థ్యం పెరిగింది’ అని పేర్కొంది. సముద్ర ఉపరితల ప్రమాదాలను ఎదుర్కోడానికి భారత్‌ వద్ద ఉన్న 6 డీజిల్‌/ఎలక్ట్రిక్‌ జలాంతర్గాముల్లో ఈ క్షిపణులను ప్రవేశపెడతామని వెల్లడించింది. భారత్‌లో నిర్మించిన స్కార్పియో తరగతికి చెందిన తొలి జలాంతర్గామి కల్వరిని ఫ్రెంచ్‌ నావికా రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ ఎస్‌ రూపొందించగా.. ముంబైలోని మజ్‌గావ్‌డక్‌లో నిర్మించారు. క్షిపణిని విజయ వంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు.

>
మరిన్ని వార్తలు