2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్‌’

28 Jan, 2018 04:44 IST|Sakshi
ఆధార్‌

జైపూర్‌: ఆధార్‌ కార్డుతో దేశవాసుల మనసుల్లో బాగా నాటుకుపోయిన ‘ఆధార్‌’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్‌ సాహితీ వేడుకలో భాగంగా శనివారం ‘ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్‌ తర్వాత మిత్రోన్‌(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్‌ అనేవి హిందీ పదాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినట్లు వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు. అయితే, జనం నోళ్లలో అత్యధికంగా నానిన పదం మాత్రం ఆధారేనని ఈ చర్చ సందర్భంగా పాత్రికేయుడు ద్వివేది వెల్లడించారు.  

మరిన్ని వార్తలు