‘పీఎం కిసాన్‌’కు ఆధార్‌ తప్పనిసరి

5 Feb, 2019 04:19 IST|Sakshi

తొలి విడతకు మినహాయింపు

న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులకు తోడ్పాటు అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతులు తమ గుర్తింపు కార్డు కింద ఆధార్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి నెలలో ఇచ్చే తొలి విడతలో మాత్రం ఇది ఐచ్ఛికమేనని (ఆప్షనల్‌) పేర్కొంది. తొలి విడత నగదు పొందేందుకు ఆధార్‌కు బదులుగా డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ ఐడీ కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండో విడత నుంచి నగదు పొందాలంటే ఆధార్‌ నంబర్‌ ఉండాల్సిందే. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం లేఖ రాసింది.

పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిబ్రవరి 1 నాటికి భూరికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది. రైతుకు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆ భూములన్నింటిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే పీఎం కిసాన్‌ పథకం అమలుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార సంఘాలను ఏర్పాటు చేయాలని  ఆదేశించింది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో నోడల్‌ యూనిట్లను, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

2019 అత్యంత శక్తివంతులు వీరే!

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

కార్గిల్‌ యుద్ధ వీరుడికి డబుల్‌ ప్రమోషన్‌!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

షోపియాన్‌లో ఎదురుకాల్పులు

అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌ అరెస్ట్‌

ఇక నుంచి లౌడ్‌స్పీకర్లు బంద్‌..!

కలాం అప్పుడే దాని గురించి చెప్పారు

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

‘ఆజం ఖాన్‌ మానసిక వికలాంగుడు’

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

వరదలో చిక్కుకున్న రైలు, ఆందోళనలో ప్రయాణీకులు 

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ఆదాయం 140 కోట్లు

ఉత్తరాఖండ్‌ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

కార్గిల్‌ విజయానికి 20 ఏళ్లు

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి

ఈనాటి ముఖ్యాంశాలు

ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!

పాకిస్తాన్‌కు అంత సీన్‌ లేదు!

బాంబే అంటే బాంబు అనుకుని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..