ఆధార్‌ అప్‌డేట్స్‌పైనా జీఎస్‌టీ భారం

6 Feb, 2018 11:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ వివరాల అప్‌డేట్స్‌పైనా 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తారనే ప్రచారం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆధార్‌ అప్‌డేట్స్‌కు 18 శాతం జీఎస్‌టీ విధించాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) యోచిస్తోంది. ప్రస్తుతం దరఖాస్తుదారు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్‌, ఈమెయిల్‌ వంటి డెమొగ్రాఫిక్‌ అప్‌డేట్‌కు యూఐడీఏఐ రూ 25 వసూలు చేస్తుండగా..అంతే మొత్తాన్ని బయోమెట్రిక్‌ అప్‌డేట్స్‌కూ చార్జ్‌ చేస్తోంది. అయితే వీటికి అదనంగా 18 శాతం జీఎస్‌టీ అమల్లోకి రావడంతో అదనంగా రూ. 4.5ను చెల్లించాల్సిన పరిస్థితి.

తాజా చార్జీల కంటే అధికంగా ఆధార్‌ సెంటర్లు వసూలు చేస్తే 1947 టోల్‌ఫ్రీ సెంటర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని యూఐడీఏ పేర్కొంది. కాగా, ఆధార్‌లో వివరాలను అప్‌డేట్‌ చేయాలంటే అందుకు అనుగుణంగా పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డ్‌, ఓటర్‌ ఐటీ, రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలను పొందుపరచాలని తెలిపింది.

మరిన్ని వార్తలు