ఆదిత్య ఠా​క్రే ఆస్తులివే..

3 Oct, 2019 14:36 IST|Sakshi

ముంబై : శివసేన యూత్‌ ప్రెసిడెంట్‌ ఆదిత్య​ ఠా​క్రేకు రూ 16 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఆదిత్య చరాస్తుల విలవ రూ 11.38 కోట్లు కాగా, రూ 4.67 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆదిత్య ప్రస్తుతం రూ 6.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కలిగిఉన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమనల్‌ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వొర్లి నుంచి బరిలో దిగిన సందర్భంలో ఆదిత్య తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. 29 ఏళ్ల ఆదిత్య ఠా​క్రే శివసేన దిగ్గజ నేత దివంగత బాల్‌ఠా​క్రే మనవడు కాగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నతొలి ఠా​క్రే కుటుంబ సభ్యుడు కావడం గమనార్హం. ఇక ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం ఆదిత్య ఠా​క్రే వద్ద రూ 13,344 నగదు ఉండగా, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్ల రూపంలో రూ 10.36 కోట్ల నగదు నిల్వలున్నాయి. రూ 20.39 లక్షలను బాండ్లు, డిబెంచర్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టారు. ఆయనకు రూ 64.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా