'కేంద్రం పొమ్మంది.. రాష్ట్రం రమ్మంది'

17 Feb, 2016 10:35 IST|Sakshi
'కేంద్రం పొమ్మంది.. రాష్ట్రం రమ్మంది'

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ అమిర్ ఖాన్ మరోసారి ప్రచార కర్త బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను ఇటీవలె ఇంక్రెడిబుల్ ఇండియా కార్యక్రమాం అంబాసిడర్గా తొలగించినా మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆయన కొత్త బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి కీలక ప్రకటనను నేడు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేయనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తున్న పథకం 'జల్ యుక్త్ శివర్ అభియాన్'కు అమిర్ ఖాన్ను అంబాసిడర్గా నియమించాలనుకుంటున్నట్లు కీలక వర్గాల సమాచారం.

ఈ పథకం ద్వారా కరువు రహిత మహారాష్ట్రగా తమ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఐదేళ్లలో 25 వేల గ్రామాలను పూర్తిగా కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. గత ఏడాదిలో 3,200 మంది రైతులు ప్రాణాలుకోల్పోయిన అంశాన్ని ప్రధానంగా సీరియస్గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతున్నట్లు సమాచారం. గత ఆదివారం 'మేక్ ఇన్ ఇండియా' సాంస్కృతిక ప్రచార కార్యక్రమంలో ఫడ్నవీస్తో కలిసి అమిర్ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. అమిర్ ఖాన్ గతంలో రైతుల ఆత్మహత్యలపై ఓ సినిమాను కూడా తీసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు