‘పూచ్-ఓ’ ఆప్‌పై ఫిర్యాదులు

27 Jul, 2014 22:28 IST|Sakshi

 న్యూఢిల్లీ: సులువైన పద్ధతిలో ఢిల్లీలోని ఆటోసేవల ను ఉపయోగించుకోవడానికి రూపొందించిన వెబ్ అప్లికేషన్ పూచ్-ఓ తప్పులతడకని వినియోగదారులు ఆక్షేపిస్తున్నారు. దీనిని ప్రారంభించిన నెల రోజుల్లో 10 వేల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆప్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులోని ఆటోడ్రైవర్ల మొబైల్ నంబర్లన్నీ తప్పుడువని చెబుతున్నారు. ఆటో కోసం శుక్రవారం తాను ఈ ఆప్ ద్వారా ఒక నంబరుకు ప్రయత్నించగా, అది గుర్గావ్‌వాసిదని తేలిందని సునీతా గుప్తా అనే మహిళ చెప్పారు. మిగతా స్మార్ట్‌ఫోన్లు యూజర్లు కూడా ఇవే తరహా ఫిర్యాదులు చేస్తున్నారు.
 
 ఢిల్లీ సమగ్ర బహుళ రవా ణా వ్యవస్థ (డిమ్‌టస్) అధికారులు రూపొందిం చిన ఈ ఆప్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నెల 11న ఆవిష్కరించారు. జీపీఎస్ సదుపాయమున్న ఆటో లు ఎక్కడున్నాయో తెలుసుకొని డ్రైవర్లను సంప్రదించడం ఈ ఆప్ ద్వారా సాధ్యపడుతుందని డిమ్‌టస్ అధికారులు చెప్పారు. ఇందుకోసం వందలాది మంది డ్రైవర్ల నంబర్లను ఆప్‌లో పొందుపరిచారు. జీపీఎస్ సదుపాయం ఉన్న ఆటోలు ఎక్కడ ఉన్నా.. సదరు ప్రదేశాన్ని ఆన్‌లైన్‌లో గుర్తించడం వీలవుతుంది. అయితే గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు దీనిని ఆక్షేపిస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఆప్‌ను ప్రవేశపెట్టేముందే డిమ్‌టస్ నంబర్లను ధ్రువీకరించుకొని ఉండే బాగుండేదని అమన్ గుప్తా అనే యూజర్ అభిప్రాయపడ్డారు.
 
 ‘ఒకరోజు నాకు ఆఫీసు ఆలస్యం కావడంతో ఆటో కోసం పూచ్-ఓ ఆప్‌ను వాడాను. అం దులో ఇచ్చిన ఫోన్ నంబరకు డయల్ చేస్తే ఆటోడ్రైవర్ తండ్రి మాట్లాడాడు’ అని రాకేశ్ కుమార్ శర్మ అనే జర్నలిస్టు వాపోయారు. నగరంలో ప్రస్తుతం 24 వేల ఆటోలకు జీపీఎస్ (జియో పొజిషనింగ్ సిస్టమ్) సదుపాయం ఉంది. మిగతా ఆటోలు కూడా జీపీఎస్ పరికరాలను బిగించుకుంటే మరిం త మందికి ఆన్‌లైన్‌లో ఆటోలు సేవలు అందుబాటులోకి వస్తాయని డిమ్‌టస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆటో డ్రైవర్ల నంబర్లు తప్పుగా నమోదు కావడంపై అధికారులు స్పందిస్తూ నంబర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ ను ఐదారు రోజుల్లో పూర్తి చేసిన తరువాత వినియోగదారులకు ఎటువంటి సమస్యలూ ఉండబోవని సంస్థ సీనియర్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు