‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’కు ఆప్‌ బంపర్‌ ఆఫర్‌!

13 Feb, 2020 17:45 IST|Sakshi

కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవం: బుడ్డోడికి ఆహ్వానం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన.. 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్‌) ఆ పార్టీలో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. తాజాగా.. బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ ఆప్‌ చేసిన మరో ట్వీట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మంగళవారం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్న ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వేషధారణతో ఉన్న.. ఓ బుడతడి ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆప్‌ విజయోత్సవాల్లో భాగంగా మినీ మఫ్లర్‌మ్యాన్‌ అంటూ పార్టీ సైతం ఆ బుడ్డోడి ఫొటోను షేర్‌ చేసింది. (కేజ్రీవాల్‌ కేబినెట్‌: వారిద్దరికి ఛాన్స్‌ లేనట్లే!)

ఇక ఫిబ్రవరి 16న అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న నేపథ్యంలో.. బేబీ మఫ్లర్‌మ్యాన్‌ను బంపర్‌ ఆఫర్‌ వరించింది. కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి సదరు బుడ్డోడిని ఆహ్వానిస్తున్నట్లు ఆప్‌ పేర్కొంది. ఈ మేరకు... ‘‘బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: ఫిబ్రవరి 16న జరుగనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి బేబీ మఫ్లర్‌మ్యాన్‌ను ఆహ్వానించాం. సూట్‌ అప్‌ జూనియర్‌!’ అని మరోసారి అతడి ఫొటోను షేర్‌ చేశారు. కాగా ఫిబ్రవరి 8న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్‌ రికార్డు స్థాయిలో 62 స్థానాలు కైవసం చేసుకోగా.. బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖాతా కూడా తెరవకలేకపోయింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు