డాక్టర్‌ ఆత్మహత్య.. ఆప్ ఎ‌మ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం

9 May, 2020 11:24 IST|Sakshi
ఆప్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌

ఎమ్మెల్యే తండ్రి, సోదరులను విచారించిన పోలీసులు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ డాక్టర్‌(52) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు డాక్టర్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనపై ఆప్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ అయింది. అలాగే ఎమ్మెల్యే అనుచరడైన కపిల్‌నగర్‌పై కూడా కేసు నమోదైంది. వీరిద్దరి అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జర్వాల్‌ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని తండ్రి, సోదరుడిని విచారిస్తున్నారు.
(చదవండి : సీనియర్‌ నేత మృతి.. విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌)

కాగా, తనకు ఈ ఆత్మహత్యతో సంబంధమే లేదని, గత 10 నెలల్లో డాక్టర్‌ను ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ చెప్పుకొచ్చారు.‘సూసైడ్‌ నోట్‌లో నా పేరు ఉందని మీడియా ద్వారా తెలిసింది. ఆయన నా పేరు ఎందుకు రాశాడో అర్థకావడం లేదు. గత 8-10 నెలల్లో నేను అతన్ని కలిసిన సందర్భాలు కూడా లేవు. గతంలో కూడా నన్ను చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు జరిగాయి.  ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. గతంలో నిర్దోషిని అని నిరూపించుకున్నట్లే, ఇప్పుడు కూడా రుజువు చేసుకుంటా. ఎలాంటి దర్యాప్తులోనైనా పోలీసులతో సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ అన్నారు.
(చదవండి : ‘రైళ్లను అనుమతించడం లేదు.. ఇది అన్యాయం’)

 కాగా, 52 ఏళ్ల డాక్టర్‌ ఏప్రిల్‌ 18న ఉరేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆయన ఓ సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఎమెమ్యే ప్రకాశ్‌ జర్వాల్‌, ఆయన అనుచరుడు తనను డబ్బులు డిమాండ్‌ చేశాడని, దానికి నిరాకరించడంతో తన వ్యాపారాలు దెబ్బతీసేపనికి ఒడికట్టారని ఆరోపించారు. డాక్టర్‌కు ఢిల్లలో మంచి నీటిని సరఫరా చేసే వాటర్‌ ట్యాంకర్లు ఉన్నాయి. 2007 నుంచి ఆయన ఈ బిజినెస్‌ను కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు