దీక్ష ఎఫెక్ట్‌; అనారోగ్యం పాలైన ఆరోగ్యశాఖ మంత్రి

18 Jun, 2018 08:40 IST|Sakshi
అనారోగ్యం పాలైన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ : గత ఏడురోజులుగా ఢిల్లీ లెఫ్నినెంట్‌ గవర్నర్‌ కార్యలయంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌తో పాటు దీక్ష చేస్తున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం పూర్తీగా క్షీణించింది. దీంతో ఆదివారం రాత్రి చికిత్స నిమిత్తం ఆయనను లోక్‌నాయక్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ పాసీ ‘మా డాక్టర్ల బృందం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీక్ష చేస్తున్న మంత్రుల ఆరోగ్యాలను పరీక్షిస్తాము. ఈ క్రమంలో భాగంగా నిన్న మధ్యాహ్నం వరకూ కూడా సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆదివారం రాత్రి సమయానికి జైన్‌ కీటోన్‌ లెవల్స్‌ బాగా పడిపోయాయి. దాంతో జైన్‌ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. విషయం తెలిసిన వెంటనే మేము జైన్‌ను ఆస్పత్రికి తరలించాము. ప్రస్తుతం అతనికి చికిత్ప అందిస్తున్నాం ’ అన్నారు.

కాగా కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలపడమే కాక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది.

ఎల్జీ తీరుపై నిరసన తెలుపుతున్న కేజ్రీవాల్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నాలుగో సమావేశ కార్యక్రమంలో పాల్గోనేందుకు ఢిల్లీ వెళ్లిన పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు