విదేశాల నుంచి వచ్చే వారికి అది తప్పనిసరి

5 May, 2020 20:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్‌కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మే 7న భారత్‌ నుంచి తొలి విమానం విదేశాలకు బయలుదేరనుంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారి కోసం కేంద్రం పలు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కేంద్ర సూచించింది. యాప్‌ లేనివారిని స్వదేశానికి రానిచ్చేది లేదని స్పష్టం చేసింది.  ఆరోగ్య సేతు యాప్‌లో స్వదేశానికి వచ్చే వారు వారి వివరాలను పొందుపరచాలని తెలిపింది. (కరోనా పరీక్షలు లేకుండా.. స్వదేశానికా?)

ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో వెలువరించింది. కాగా  కరోనా (కోవిడ్‌-19)పై సమగ్ర సమాచారమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి, సంబంధీకులతో మనం కనెక్ట్‌ అయ్యామా? విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చామా, కరోనా వైరస్‌ సోకే లక్షణాలేమైనా ఉన్నాయా అనే వివరాలను యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అనంతరం యాప్‌ మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. (విదేశాల నుంచి స్వదేశానికి : టికెట్లు ధరలు ఇవే)

మరిన్ని వార్తలు