ఆర్టికల్‌ 370: రెండు నెలల తర్వాత తొలిసారి

6 Oct, 2019 15:32 IST|Sakshi

పార్టీ నేతలతో సమావేశమైన ఎన్సీ అధినేతలు

శ్రీనగర్‌: రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్​ కాన్ఫరెన్స్ (ఎన్​సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆదివారం తన పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్​సీ​ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్​ సింగ్​ రానా నేతృత్వంలో 15మంది సీనియర్‌ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని.. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4వ తేదీ నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాతోపాటు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని ఎన్‌సీ నేతలు ఫరూక్‌, ఒమర్ అబ్దుల్లాలను కలిశారు.

మరిన్ని వార్తలు