జనరిక్‌ మందులు రాయకుంటే చర్యలు

23 Apr, 2017 01:44 IST|Sakshi
జనరిక్‌ మందులు రాయకుంటే చర్యలు

న్యూఢిల్లీ: ఇక వైద్యులు జనరిక్‌ మందులనే ప్రిస్క్రిప్షన్‌లో రాయాలని, అలా రాయని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) హెచ్చరించింది. జనరిక్‌ మందులపై తాజాగా ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలకు ఎంసీఐ నడుంబిగించింది.

వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌లో మందుల పేర్లను పెద్దక్షరాలతోనే (కేపిటల్‌ లెటర్స్‌) రాయాలని ఆదేశించింది. 2016లోనే ఈ ఆదేశాలు జారీ చేసినా సరిగా అమలు కాకపోవడంతో.. ఇకపై చర్యలకు ఉపక్రమించనున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు