టీవీ నటి ఆత్మహత్య; ప్రియుడిపై కేసు

5 Apr, 2016 17:40 IST|Sakshi
టీవీ నటి ఆత్మహత్య; ప్రియుడిపై కేసు

ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు రోజుల తర్వాత ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు అతడిపై అభియోగాలు మోపారు. ప్రత్యూష కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రకటనలను ఆధారంగా చేసుకుని ముంబై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఛాతీలో నొప్పి, లో బీపీ, కుంగుబాటు కారణాలతో ఆదివారం రాహుల్ ఆస్పత్రిలో చేరాడు. అతడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించినట్టు రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు.

ప్రొడక్షన్ కంపెనీ నడుపుతున్న రాహుల్ ను ప్రత్యూష పెళ్లి చేసుకోవాలనుకుందని వీరి స్నేహితులు వెల్లడించారు. బెంగాలీ నూతన సంవత్సరాది రోజైన ఈ నెల 14న వారు పెళ్లి చేసుకోడానికి సిద్ధమయినట్లు చెప్పారు. కాగా, ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఆమె తల్లిదండ్రుల కోసం రూ. 50 లక్షల అప్పు తీసుకుందని రాహుల్ తండ్రి హర్షవర్ధన్ చెప్పారు. దీంతో ఆమె ఒత్తిడికి గురయ్యేదన్నారు. ఆమెకు అప్పుడప్పుడు రూ. పది వేల చొప్పున డబ్బులు పంపేవాడినని అన్నారు. ఈ విషయాలన్నిటిపై పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.

>
మరిన్ని వార్తలు