తెర వెనుక హైడ్రామా

7 Dec, 2017 01:45 IST|Sakshi

విశాల్‌ నామినేషన్‌ తిరస్కరణలో రాజకీయం!


సాక్షి, చెన్నై: సినీ నటుడు విశాల్‌ ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో పోటీచేయకుండా అడ్డుకునేందుకు సినిమా స్టైల్లోనే కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు ప్రజల ఓటు చీలడం ఖాయమన్న సంకేతాలతో అధికార పక్ష అన్నాడీఎంకే వర్గం తెర వెనక రాజకీయం సాగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విశాల్‌ పేరును ప్రతిపాదిస్తూ ఆర్కే నగర్‌కు చెందిన పదిమంది సంతకాలు చేశారు. పరిశీలన సమయంలో వారిలో సుమతి, దీపన్‌ల సంతకాలపై అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తొలుత విశాల్‌ నామినేషన్‌ పత్రాన్ని పెండింగ్‌లో పెట్టారు.

ఈలోగా సుమతి, దీపన్‌లకు వచ్చిన బెదిరింపుల ఆడియో టేపుల్ని విశాల్‌.. రిటర్నింగ్‌ ఆఫీసర్‌(ఆర్వో) దృష్టికి తీసుకెళ్లారు. విచారణ ముగియడంతో నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. చివరకు 11 గంటల సమయంలో సుమతి, దీపన్‌ల సంతకాలు బోగస్‌ అని తేల్చి విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆర్వో వేలుస్వామి అధికారికంగా ప్రకటించారు. ఇతర స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పెద్దగా పట్టించుకోని ఆర్వో ఒక్క విశాల్‌ నామినేషన్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని చూస్తే, తెర వెనుక ఏమేరకు రాజకీయం సాగిందో స్పష్టమవుతోంది.

అడ్డుకోవడం అక్రమం: విశాల్‌
తన నామినేషన్‌ తిరస్కరణకు గురవడంతో విశాల్‌ ఈ విషయాన్ని ట్వీటర్‌ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీల దృష్టికి తీసుకెళ్లారు. సినీ వర్గాలు విశాల్‌కు బాసటగా నిలిచాయి.

మరిన్ని వార్తలు