వణుకుతున్న పంజాబ్‌

26 Dec, 2017 15:47 IST|Sakshi

సాక్షి, చండీగఢ్‌ : ఉత్తర భారతం చలికి గజగజ వణుకుతోంది. ఎన్నడూ లేనంత స్థాయిలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో అతితక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. పంజాబ్‌లోని అదమ్‌పూర్‌లో సోమవారం అతి తక్కువగా 3.7 డిగ్రీల సెల్సీయెస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇవే గణాంకాలు బుధవారం నాడు కూడా నమోదయ్యాయి.

హర్యానాలో కూడా.. సగటు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అమృత్‌సర్‌లో 5.4 డిగ్రీలు, ఫరీద్‌కోట్‌, గురుదాస్‌పూర్‌లలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా లూధియానాలో 5.8, హల్వారాలో 5.9, పఠాన్‌కోట్‌లో 7, చండీగఢ్‌, పాటియాలలో 8.5 డిగ్రీలు నమోదయ్యాయి. హర్యానాలోని హిస్సార్‌లో 6.1, కర్నాల్‌ ఏరియాలో 6.5,  రోహతక్‌లో 6.4, అంబాలా, సిర్సాలో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 

మరిన్ని వార్తలు