‘7.2 శాతం వృద్ధి రేటుతో దూసుకెళతాం’

3 Apr, 2019 11:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ నరేంద్ర మోదీ సర్కార్‌కు ఊరట ఇచ్చే అంచనాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 7.2 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) బుధవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుని 7.2 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఏడాది 7.3 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఏడీబీ నివేదిక అంచనా వేసింది.

వడ్డీరేట్లు దిగిరావడం, రైతులకు పెట్టుబడి ఊతం, దేశీయ డిమాండ్‌ ఊపందుకోవడంతో భారత్‌ నిలకడైన వృద్ధి రేటు నమోదు చేస్తుందని నివేదిక పేర్కొంది. దేశీయ వినిమయం పటిష్టంగా ఉండటంతో ఎగుమతులు తగ్గినా దాని ప్రభావం ఆసియా దేశాలపై అంతగా ఉండబోదని ఏడీబీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ యుసుకి సవద పేర్కొన్నారు. ఆసియా దేశాలు సైతం రాబోయే రెండేళ్లలో ఐదు శాతం మేర వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఏడీబీ అంచనా వేసింది.

మరిన్ని వార్తలు