మావోయిస్టుల ఏరివేతకు మరిన్ని కేంద్ర బలగాలు

7 Dec, 2014 12:58 IST|Sakshi

న్యూఢిల్లీ: మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం మరింత దృష్టిసారిస్తోంది. చత్తీస్గఢ్లో భద్రత దళాలపై మావోయిస్టులు పంజా విసిరిన నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. మావోయిస్టుల అరికట్టడానికి మరో 11 వేలమంది పారా మిలటరీ బలగాలను కేటాయించాలని నిర్ణయించింది. చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతానికి కేంద్ర బలగాలను పంపనున్నారు. ఇటీవల ఇక్కడ మావోయిస్టులు చేసిన దాడిలో 14  సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.

మరిన్ని వార్తలు