వచ్చే ఏడాది నుంచి ఆయుష్‌ కోర్సులకూ నీట్‌ తప్పనిసరి

10 Jun, 2017 01:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆయుష్‌ (ఆయుర్వేద, యోగ అండ్‌ నేచురోపతి, యునాని, సిద్ధ అండ్‌ హోమియోపతి) కోర్సుల్లో ప్రవేశాలకు 2018 విద్యాసంవత్సరం నుంచి నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)ను  తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది.

ఆయుష్‌ కోర్సులకు నీట్‌ పరీక్ష తప్పనిసరిపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఈ ఏడాదికి మాత్రమే మినహాయింపునిచ్చామని కేంద్రం వివరించిం ది. ఆయుష్‌ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువవడంతో ఈ కోర్సుల్లో విద్యాప్రమాణాలను మరింతగా పెంచి మెరిట్‌ విద్యార్థులకు చోటు దక్కేందుకు నీట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. ఇకపై ఆయుష్‌ సీట్ల భర్తీ కోసం ప్రైవేటు సంస్థలు సొంత ప్రవేశపరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు.

ఈసారి లక్నోలో యోగా వేడుకలు
జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాన్ని ఈ సారి లక్నోలో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, యూపీ సీఎం ఆదిత్యనాథ్, యోగా గురువులతోపాటు 51,000 మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఢిల్లీలో ఏడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు