కరోనా నుంచి తప్పించుకోండిలా..

2 Mar, 2020 20:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీచేసింది. తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి ఉపయోగించరాదని పేర్కొంది. మరిన్ని వివరాలకు భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కంట్రోల్‌ రూం నెంబర్‌ 91-11-23978046 ను, ncov2019@gmail.com ను సంప్రదించాలని తెలిపింది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
⇒ 
చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి
 సమూహాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
⇒ మీ కళ్లు, ముక్కు, నోటిని టచ్‌ చేయడం విరమించాలి
 దగ్గు, తుమ్ములు వస్తే ముక్కు, నోటికి చేతులు అడ్డుపెట్టుకోవాలి
⇒ జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి
 మాస్క్‌ను ధరించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
⇒ ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి వాడరాదు
మాస్క్‌ ముందు భాగం ముట్టుకోకుండా వెనుకనుంచి తొలగించాలి
⇒ మాస్క్‌ను తీసిన వెంటనే డస్ట్‌బిన్‌లో పడవేయాలి

చదవండి : హైదరాబాద్‌లో తొలికేసు: కరోనా అలర్ట్‌

మరిన్ని వార్తలు