నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా?

18 Jan, 2020 08:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌​ నిర్భయ తల్లి ఆశాదేవికి ఆసక్తికరమైన విన్నపాన్ని చేశారు. ఏడేళ్ల క్రితం తన కుమార్తె (నిర్భయ)పై సామూహిక హత్య చారం చేసిన వారిని క్షమించాలని  ఆమె కోరారు. ఈ విషయంలో  ఆమె పెద్దమనసు చేసుకోవాలని ఇందిరా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగాఈ విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి, రాజీవ్‌ గాంధీ  భార్య సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు ద్వారా హత్య చేసిన కేసులోనళినిని సోనియా క్షమించినట్టుగానే, నలుగురు దోషులకు  కూడా ఆశాదేవి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నామని జైసింగ్ ట్వీట్ చేశారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనకు పూర్తి మద్దతు తెలిపిన ఇందిరా మరణశిక్ష వద్దు.. ఉరి శిక్షలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నరాన్నవార్తలపై ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కోర్టులు, ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. అలాగే 2012లో నిర్భయ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, మహిళల భద్రత కోసం నినాదాలు చేసిన వ్యక్తులే, రాజకీయ ప్రయోజనం కోసం తన కుమార్తె మరణాన్ని వాడు కుంటున్నారని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయ లాభాల కోసమే ఉరిశిక్ష అమలును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే  గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా  చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దోషులను ఉరితీసే వరకు తనకు మనశ్శాంతి లేదంటూ కంట తడిపెట్టారు.  

ఈ నేపథ్యంలో ఇందిరాజైసింగ్‌ అభ్యర్థనను, ఆశాదేవి అంగీకరిస్తారా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఏం నేరమూ చేయని తన కుమార్తెను అతికిరాతంగా హత్య చేసిన వారికి మరణ శిక్షే న్యాయమంటూ.. ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఆమె ఇపుడు హంతకులను క్షమిస్తారా? పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి, క్షమించడమనే ఉదాత్తమైన నిర్ణయం తీసుకుంటారా... లేదంటే..దేశవ్యాప్తంగా ఎందరో ఆడబిడ్డల కన్నతల్లులకు తీరని కడుపుశోకాన్ని మిగిల్చుతున్న వారికి ఇదే న్యాయమంటారా?  వేచి చూడాలి

 కాగా  2012 డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధానిలో కదిలే బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిత్య హత్యాచారానికి పాల్పడిన కేసులో వినయ్, అక్షయ్, పవన్, ముకేశ్‌ అనే నలుగురు దోషులుగా  (ఒక దోషి జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో దోషి మైనర్‌ కావడంతో శిక్షనుంచి మ తప్పించుకున్నాడు) నిర్దారించారు.   సుదీర్ఘ విచారణ, న్యాయపరంగా అన్ని అడ్డంకులను అధిమించిన  అనంతరం ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. 

చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు 

నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు

చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధికారిక గుర్తింపులకు ఆయన అతీతుడు 

ఘోరం: ఆమెను కొట్టి చంపేశారు!

నేటి ముఖ్యాంశాలు..

ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు 

కశ్మీర్‌పై అనుమానాలేం లేవు

సినిమా

అందాల ‘నిధి’

చిట్టి చిలకమ్మ

ఆ నలుగురూ నాకు స్ఫూర్తి

వెండి తెరపై మండే భాస్వరం

కోల్‌కతాలో కోబ్రా

నా బలం తెలిసింది

-->