8 వ‌జ్రాల యూనిట్లు ష‌ట్‌డౌన్

13 Jun, 2020 17:27 IST|Sakshi

అహ్మ‌దాబాద్ :  సూర‌త్‌లోని వ‌జ్రాల ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుతూనే ఉన్నాయి. దీంతో ఆయా సంస్థ‌ల‌ను మూసివేయాల‌ని శ‌నివారం  సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) తెలిపింది. మిగ‌తా సిబ్బంది కూడా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాల‌ని సూచించింది. దేశంలోని అతిపెద్ద డైమండ్ క‌టింగ్, పాలిషింగ్ హ‌బ్‌లుగా పేరున్న సూర‌త్‌లోని వ‌జ్రాల ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. (‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే.. )

గ‌త మూడు రోజుల్లోనే  ఎనిమిది డైమండ్ యూనిట్ల‌లో  23 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో ఈ ఎనిమిది యూనిట్ల‌ను మూసివేస్తున్న‌ట్లు ఎస్‌ఎంసి డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ ఆశిష్ నాయక్ శనివారం తెలిపారు. అంతేకాకుండా సామాజిక దూరం పాటించని యూనిట్ల‌కు ఒక్కొక్క‌రికి రూ. 10,000 జరిమానా విధించారు. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌డానికి సామాజిక దూరం, ఫేస్ మాస్క్ , శానిటైజేష‌న్ లాంటి నిబంధ‌న‌లు పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు  వజ్రాల యూనిట్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. సూర‌త్‌లో సుమారు 6,000 డైమండ్ యూనిట్లు ఉండ‌గా, దాదాపు 6.5 ల‌క్ష‌ల‌మంది కార్మికులు ప‌నిచేస్తుంటారు. జూన్ 1న  ప‌రిశ్ర‌మలు తెరిచేందుకు కేంద్రం అనుమ‌తివ్వ‌డంతో తిరిగి ప‌నులు ప్రారంభ‌మయ్యాయి. ప్ర‌స్తుతం ఈ యూనిట్ల‌లో 2 నుంచి 2.25 లక్ష‌ల మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు. (సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలు..)


 

మరిన్ని వార్తలు