జ‌ర్న‌లిస్టులు జాగ్ర‌త్త‌లు పాటించాలి : కేంద్ర మంత్రి

21 Apr, 2020 09:28 IST|Sakshi

ముంబై :  దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ర్ట‌లోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా 50 మంది జ‌ర్న‌లిస్టుల‌కు కూడా వైర‌స్ సోకిన నేప‌థ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులకు సూచించారు.  ‘‘50 మంది జర్నలిస్టులు, ముఖ్యంగా కెమెరామెన్ లు ముంబైలో కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించడం ఆశ్చర్యకరం. విధినిర్వహణలో ప్రతీ జర్నలిస్ట్ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి’’అని కేంద్రమంత్రి జవదేకర్ అన్నారు.అత్య‌వ‌స‌ర విభాగంలాంటి మీడియాలో ప‌నిచేస్తున్న వారు నిర్విరామంగా ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందిస్తున్నారు. అంతేకాకుండా రెడ్‌జోన్ల‌లాంటి ప్రాంతాల్లో ఫీల్డ్ రిపోర్టింగ్ చేస్తూ ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందించ‌డంలో ముందుంటారు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ర్ట‌లో 50 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సో్కింది. దీంతో వారు స‌న్నిహితంగా మెలిగిన మిగ‌తావారిని కూడా క్వారంటైన్‌లో ఉంచారు. 


 

మరిన్ని వార్తలు