కేరళను పీడిస్తున్న ర్యాట్‌ ఫీవర్‌

4 Sep, 2018 03:44 IST|Sakshi

తిరువనంతపురం: వరద బీభత్సం అనంతరం కేరళలో ర్యాట్‌ ఫీవర్‌ (లెప్టోస్పైరోసిస్‌) విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 9 మంది చనిపోగా, 71 మందికి చేసిన రక్తపరీక్షల్లో పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో మరో 123 మంది ఇవే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. పాలక్కడ్, కోజికోడ్‌ జిల్లాల్లో ర్యాట్‌ ఫీవర్‌ ప్రభావం ఎక్కువగా ఉందని కేరళ డైరెక్టరేట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ప్రకటించింది. వరదలు తగ్గుముఖం పట్టాక వివిధ రకాల జ్వరాలతో రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందిన వారి సంఖ్య 13,800 దాటింది. ర్యాట్‌ ఫీవర్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అలప్పుజ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలా ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. చాలాచోట్ల పునరావాస కేంద్రాలు ఇంకా కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు