ముంచెత్తిన వాన: భారీ ట్రాఫిక్‌

1 Sep, 2018 11:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరాన్ని భారీ వాన ముంచెత్తింది. ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొన్నిగంటలపాటు కురిసిన భారీ వర్షంతో అనేకచోట్ల రోడ్లపై వరద ముంచెత్తింది. భారీగా ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. బిజీ రోడ్లపై భారీగా నీరుపారడంతో వాహనదారులు, పాదచారులు అనేక ఇబ్బందులకు లోనయ్యారు.  కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా ప్రభావితమైంది. మరికొన్ని ఏరియాల్లో టెలికాం సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హనుమాన్ మందిర్ సమీపంలో రింగ్  యమునా బజార్‌లో వర్షపు నీటిలో  ప్రభుత్వ బస్సు మొరాయించింది. దీంతో బస్సులో చిక్కుకుపోయిన సుమారు 30 మంది ప్రయాణీకులను అధికారులు రక్షించారు.   అలాగే మోడీ మిల్ , భైరన్ మార్గ్, లజపత్ నగర్ మార్కెట్‌ తదితర ప్రాంతాలలోని రోడ్లపై వరద పారుతోంది. ఈ పరిస్థితిపై నగర ట్రాఫిక్‌  పోలీసు విభాగం అలర్ట్‌ జారీ చేసింది. రోడ్లపై నీరు నిలిచిపోయిన కారణంగా  కొన్ని మార్గాల్లో ప్రయాణాలను, తప్పించడం లేదా మానుకోవాల్సిందిగా  నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఢిల్లీ వర్షాలు ట్విటర్‌ టాప్ ట్రెండ్స్‌లో నిలవడం విశేషం.Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనుచిత వ్యాఖ్యలు : ఎమ్మెల్యే అరెస్టు..!

పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు..!

రయ్‌.. రయ్‌.. దూసుకెళ్తాం

గిన్నిస్‌ నృత్యం

రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?

ఆ ఇద్దరికీ నేను ఫిదా

మా ముద్దుల కూతురు... నుర్వీ

కథగా కేర ళ ట్రాజెడీ

ఒక్కడే కానీ మూడు గెటప్స్‌

స్కూల్‌ స్టూడెంట్‌గా...