చనిపోయిన వ్యక్తి వీర్యంతో కవలలు!

16 Feb, 2018 12:23 IST|Sakshi

సరోగసి పద్దతి ద్వారా మనవళ్లను పొందిన ఓ తల్లి

పుణె : చనిపోయిన కూమారుని వీర్యంతో సరోగసి పద్దతి ద్వారా వారసులను పొందారు మహారాష్ట్రాలోని ఓ తల్లి. అమ్మతనానికి నోచుకోని ఎందరో తల్లులు ఆధునిక వైద్య పద్దతుల ద్వారా పిల్లలను కంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలా చనిపోయిన వారి వీర్యంతో పిల్లలను కనడం ఇదే తొలిసారి కావచ్చు. తన కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి ఇదే పద్దతిలో  వారుసులను పొందారు. 

పుణెకు చెందిన 27 ఏళ్ల ప్రథమేష్‌ పాటిల్‌ పైచదవుల కోసం జర్మనీ వెళ్లాడు. 2013లో ఏదో ఆరోగ్య సమస్యతో పరీక్షలు చేయించుకుంటే తనకు బ్రేయిన్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. వైద్యులు కీమోథెరపీ చికిత్సను అందించాలన్నారు. ఈ చికిత్స కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న డాక్టర్లు అతడి అనుమతితో వీర్యం శాంపిళ్లను తీసి భద్రపరిచారు. తొలుత తగ్గినట్లు కనిపించిన క్యాన్సర్‌ ఒక్కసారిగా తిరగబెట్టింది దీంతో ప్రథమేష్‌ 2016లో మరణించాడు. అప్పటికి అతనికింకా పెళ్లి కూడా కాలేదు. కొడుకంటే  అతని తల్లి రాజ్‌ శ్రీ పాటిల్‌కు విపరీతమైన ప్రేమ. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది.

ఎలాగైనా తన కొడుకు తిరిగి పొందాలనుకుంది. ఈ తరుణంలో వీర్యం దాచిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే పుణెలోని సహ్యాద్రి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి ఈ విషయం తెలియజేసింది. ఆమె సాయంతో జర్మనీలో భద్రపరిచిన వీర్యాన్ని తెప్పిచ్చిన వైద్యులు ప్రథమేశ్ కుటుంబ సభ్యులలోని ఓ మహిళ నుంచి అండాలు సేకరించి, వాటితో నాలుగు పిండాలను రూపొందించారు.

వీటిని తన గర్భంలో ఉంచుకోవటానికి ప్రథమేశ్‌ తల్లి రాజ్‌ శ్రీ(49) ముందుకొచ్చినప్పటికి ఆమె శరీరం అనుకూలించదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో రాజ్‌ శ్రీ సోదరి గర్భంలో రెండు పిండాలను గతేడాది మే నెలలో ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో గత సోమవారం ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారు. దీంతో ప్రథమేశ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇలాంటి పద్ధతిన పిల్లల్ని కనడం ఇదే మొదటిసారి కాదని, ఇప్పటివరకు రెండు, మూడు జరిగాయని ఇండియన్ సరోగసీ లా సెంటర్ వ్యవస్థాపకుడు హరిరామసుబ్రమణియన్ తెలిపారు.

రాజ్‌ శ్రీ పాటిల్‌, ఆమె కూతురు ప్రిషా( పిల్లలు పట్టుకున్నవారు),  ప్రథమేష్‌ ( ఫొటో,ఇన్‌ సెట్‌లో)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పార్టీ నేతలపై మండిపడ్డ ప్రియాంకా గాంధీ

వాళ్లు వంట చేస్తే మా పిల్లలు తినరు..

3 భాగాలుగా ఓబీసీ కోటా?

శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం

మరికొంతకాలం అమిత్‌ షాయే!

వారంతా అమరులయ్యారు

ఒమన్‌ వైపు ‘వాయు’ గమనం

మనకూ ఓ అంతరిక్ష కేంద్రం

మాజీ ఎంపీ, జర్నలిస్టు రాజ్‌నాథ్‌సింగ్‌ మృతి

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం: లక్ష్మణ్‌

ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇదే..

సీఎం అల్టిమేటం; లెక్కచేయని వైద్యులు

కూలిన ఏఎన్‌- 32.. 13 మృతదేహాలు వెలికితీత

ఇంట్లో పాములు.. పొరుగిళ్లలో తలదాచుకుంటూ..

అప్పటివరకూ అమిత్‌ షానే..

21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత ‘వేడి’

రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌కు చెక్‌ : జేడీయూ

‘వారి లవ్‌ ఎఫైర్‌తో షాకయ్యా’

భావ ప్రకటనకు మరింత బలం

అమిత్‌ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం

చిన్నమ్మ విడుదల వీలుకాదు

ఓటర్లకు సోనియా కృతజ్ఞతలు

ఆధార్‌ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

ఐసిస్‌ మాడ్యూల్‌ సూత్రధారి అరెస్టు

కశ్మీర్‌లో ఉగ్ర దుశ్చర్య

పాక్‌ మీదుగా వెళ్లను

లోక్‌సభలో బీజేపీ నేతగా మోదీ

గుజరాత్‌కు ‘వాయు’ గండం

స్క్రామ్‌జెట్‌ పరీక్ష సక్సెస్‌

జూలై 15న చంద్రయాన్‌2

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు

ప్రేమలో పడను

కంటిని నమ్మొద్దు

పారితోషికం 14 కోట్లు?

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ