'వరకట్న పెళ్లిళ్లను బాయ్ కాట్ చేయండి'

15 Apr, 2017 13:15 IST|Sakshi
'వరకట్న పెళ్లిళ్లను బాయ్ కాట్ చేయండి'
మద్యం తయారీని, విక్రయాన్ని, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మరొక ఆదర్శవంతమైన క్యాంపెయిన్ ప్రారంభించారు. వరకట్నం, బాల్య వివాహాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని ప్రసంగించిన నితీష్ కుమార్, వరకట్నం తీసుకునే వారిపై మండిపడ్డారు. వరకట్నం తీసుకుని పెళ్లిళ్లు చేసుకునే మ్యారేజ్ వేడుకలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. ''వరకట్నం తీసుకున్నట్టు తెలిస్తే. ఆ పెళ్లి వేడుకలకు అసలు హాజరుకావొద్దు'' అని నితీష్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సమాజంలో ఉన్న వరకట్నాన్ని నిర్మూలించాల్సినవసరం ఎంతో ఉందని చెప్పారు.
 
బాల్య వివాహాలను అరికట్టడానికి కూడా తమదైన శైలిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి వ్యతిరేకంగా నెలకొన్న ఈ వికృత అంశాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను ఆయన హైలెట్ చేశారు. మద్య నిషేధాన్ని తమ ప్రభుత్వం ఎంత పకడ్భందీగా అమలుచేసిందో, అంతే పట్టువిడవని ధోరణిలో బాల్యవివాహాలు, వరకట్నాలకు వ్యతిరేకంగా పోరాడతామని సీఎం చెప్పారు. ఎస్కే మెమోరియల్ హాల్ లో జేడీయూ నిర్వహించిన ఈ ఈవెంట్లో రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ లీడర్ శ్యామ్ రజక్, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ చౌదరి, పలువురు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు