రాజీవ్ గాంధీ తర్వాత మళ్లీ మోదీయే!

11 Nov, 2014 16:55 IST|Sakshi
రాజీవ్ గాంధీ తర్వాత మళ్లీ మోదీయే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాలలో పదిరోరజుల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన మయన్మార్లో పర్యటిస్తున్నారు. అక్కడి పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఆస్ట్రేలియా వెళ్తారు. 1986 సంవత్సరంలో రాజీవ్ గాంధీ తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనున్న రెండో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అవుతారు. ఆస్ట్రేలియాలో జరిగే జి20 దేశాల సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. అనంతరం, ఆ దేశ ప్రధానమంత్రి టోనీ అబాట్తో చర్చలు కూడా జరుపుతారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా పర్యటన కోసం అక్కడి ప్రవాస భారతీయులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో అమెరికాలో నరేంద్రమోదీ పర్యటించినప్పుడు అక్కడ మాడిసన్ స్క్వేర్ ప్రాంతంలో ఆయన చేసిన ప్రసంగం చరిత్రాత్మకం కావడం, లక్షలాది మంది దాన్ని వీక్షించడం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియాలో కూడా మోదీకి ఘన స్వాగతం పలకాలని అక్కడివారు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు